Monday, November 16, 2026
Homeతెలంగాణకరీంనగర్మహాశక్తి ఆలయంలో మహాగౌరీ అవతారంలో అమ్మవారి దర్శనం

మహాశక్తి ఆలయంలో మహాగౌరీ అవతారంలో అమ్మవారి దర్శనం

📰 Generate e-Paper Clip

  • ఆలయ ప్రాంగణంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 18 (చైతన్యగళం):

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయంలో ఎనిమిదో రోజు అమ్మవారు మహాగౌరీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన గౌరీదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదివారం ఉదయం మహాశక్తి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌తో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఆశీర్వచనాలు అందించారు.

మరోవైపు, ఆదివారం సాయంత్రం మహాశక్తి ఆలయ ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడుతూ, పాటలు పాడుతూ పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు, సద్దుల బతుకమ్మ వేడుకలతో మహాశక్తి ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!