Tuesday, October 20, 2026
Homeతెలంగాణకరీంనగర్గంగుల కమలాకర్‌ నివాసంలో బతుకమ్మ సందడి

గంగుల కమలాకర్‌ నివాసంలో బతుకమ్మ సందడి

📰 Generate e-Paper Clip

  • కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు

కరీంనగర్‌, అక్టోబర్‌ 18 (చైతన్యగళం):

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కరీంనగర్‌ శాసనసభ్యుడు, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ నివాసంలో సందడి నెలకొంది. ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించారు. వాటి చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. కుటుంబ సభ్యులంతా కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. గంగుల కమలాకర్‌ సైతం ఈ వేడుకలను తిలకించారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను కుటుంబ సభ్యుల మధ్య సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!