గంగుల కమలాకర్ నివాసంలో బతుకమ్మ సందడి
కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలు కరీంనగర్, అక్టోబర్ 18 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కరీంనగర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో సందడి నెలకొంది. ఆయన నివాసంలో కుటుంబ సభ్యులు బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించారు. వాటి చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు. కుటుంబ సభ్యులంతా...