Wednesday, October 21, 2026
Homeతెలంగాణకరీంనగర్అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

  • ఎక్కడా పెండింగ్‌లో పెట్టొద్దు.. అధికారులకు కలెక్టర్‌ చిత్రా మిశ్రా ఆదేశం

కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం):

డీఎంఎఫ్‌టీ, ఎస్‌డీఎఫ్‌, ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో మంజూరైన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల అమలులో ఎక్కడా జాప్యం జరగకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి సీపీఓ రామ్‌ దత్తారెడ్డి, సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నిధుల కింద మంజూరైన అభివృద్ధి పనుల పురోగతి, నిధుల మంజూరు, పనుల ప్రస్తుత స్థితిగతులపై సమీక్షించారు.

మంజూరైన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్‌ సూచించారు. పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ఏ పనీ పెండింగ్‌లో ఉండకుండా నిరంతరం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.

ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో సీపీఓ రామ్‌ దత్తారెడ్డి, సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!