అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
ఎక్కడా పెండింగ్‌లో పెట్టొద్దు.. అధికారులకు కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశం కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): డీఎంఎఫ్‌టీ, ఎస్‌డీఎఫ్, ఎంపీ ల్యాడ్స్ నిధులతో మంజూరైన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పనుల అమలులో ఎక్కడా జాప్యం జరగకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి సీపీఓ రామ్ దత్తారెడ్డి, సంబంధిత ఇంజినీరింగ్ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ...