Friday, October 16, 2026
Homeతెలంగాణకరీంనగర్ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వెలిచాల రాజేందర్‌రావు భేటీ

ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వెలిచాల రాజేందర్‌రావు భేటీ

📰 Generate e-Paper Clip

  • కరీంనగర్‌లో పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల కార్యాచరణపై చర్చ

కరీంనగర్‌, అక్టోబర్‌ 15 (చైతన్యగళం): కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సహారన్‌పూర్‌ లోక్‌సభ సభ్యుడు ఇమ్రాన్‌ మసూద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరిస్తున్న కార్యాచరణను రాజేందర్‌రావు వివరించారు.

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు

కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించే లక్ష్యంతో క్షేత్రస్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు, నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఖర్గేకు వివరించారు. నియోజకవర్గ పరిధిలో అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొందేందుకు కృషి చేసినట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

కరీంనగర్‌ నియోజకవర్గ ప్రజలతో పాటు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నట్లు రాజేందర్‌రావు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు.

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా కృషి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన పేదలకు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజేందర్‌రావు తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని ఖర్గేకు వివరించారు.

కరీంనగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెలిచాల రాజేందర్‌రావు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పార్టీ ప్రతిష్ఠను పెంపొందిస్తూ, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా మరింత కష్టపడి పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించినట్లు ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!