ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో వెలిచాల రాజేందర్‌రావు భేటీ

కరీంనగర్‌లో పార్టీ బలోపేతం, స్థానిక ఎన్నికల కార్యాచరణపై చర్చ కరీంనగర్‌, అక్టోబర్‌ 15 (చైతన్యగళం): కాంగ్రెస్‌ పార్టీ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సహారన్‌పూర్‌ లోక్‌సభ సభ్యుడు ఇమ్రాన్‌ మసూద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్‌ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరిస్తున్న కార్యాచరణను రాజేందర్‌రావు వివరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి...