Wednesday, October 14, 2026
Homeతెలంగాణకరీంనగర్ఉద్యోగుల సెలవుల కోసం నూతన ఆన్‌లైన్‌ విధానం

ఉద్యోగుల సెలవుల కోసం నూతన ఆన్‌లైన్‌ విధానం

📰 Generate e-Paper Clip

  • డిజిటల్‌ సెలవుల నిర్వహణ పోస్టర్‌ను ఆవిష్కరించిన కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌

కరీంనగర్‌, అక్టోబర్‌ 13 (చైతన్యగళం):

పాలనలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు ఉద్యోగుల సేవలను మరింత సులభతరం చేసే దిశగా కరీంనగర్‌ నగరపాలక సంస్థ మరో ముందడుగు వేసింది. ఉద్యోగుల సెలవుల దరఖాస్తుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన ఆన్‌లైన్‌ సెలవుల నిర్వహణ వ్యవస్థ పోస్టర్‌ను మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆవిష్కరించారు.

ఈ నూతన విధానం ద్వారా ఉద్యోగులు తమ సెలవుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నేరుగా సంబంధిత అధికారికి పంపించవచ్చు. దరఖాస్తు ఏ దశలో ఉందో, ఆమోదం పొందిందో లేదో కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యం కల్పించారు. ఈ వ్యవస్థను కరీంనగర్‌ ఐటీ టవర్‌లోని థీమ్‌ అప్‌ సంస్థ ప్రత్యేకంగా రూపొందించింది.

ఉద్యోగుల సమయాన్ని ఆదా చేసే డిజిటల్‌ విధానం

ఈ సందర్భంగా కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ.. నూతన సెలవుల నిర్వహణ వ్యవస్థ ద్వారా ఉద్యోగుల సెలవుల వివరాలను సులభంగా నమోదు చేయడంతో పాటు సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చని తెలిపారు. ప్రతి ఉద్యోగి ఈ విధానం ద్వారానే సెలవుల కోసం దరఖాస్తు చేసుకొని, దాని ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

డిజిటల్‌ పాలనను సమర్థవంతంగా అమలు చేయడానికి, ఉద్యోగుల సమయపాలనను మెరుగుపరచడానికి, కార్యాలయ కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, ఉప కమిషనర్లు ఖాదర్‌ మొహియుద్దీన్‌, వేణుమాధవ్‌, సహాయ కమిషనర్‌ రాజమనోహర్‌, కార్యనిర్వాహక ఇంజినీర్‌ లచ్చిరెడ్డి, థీమ్‌ అప్‌ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!