ఉద్యోగుల సెలవుల కోసం నూతన ఆన్‌లైన్‌ విధానం

డిజిటల్‌ సెలవుల నిర్వహణ పోస్టర్‌ను ఆవిష్కరించిన కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ కరీంనగర్‌, అక్టోబర్‌ 13 (చైతన్యగళం): పాలనలో పారదర్శకతను పెంపొందించడంతో పాటు ఉద్యోగుల సేవలను మరింత సులభతరం చేసే దిశగా కరీంనగర్‌ నగరపాలక సంస్థ మరో ముందడుగు వేసింది. ఉద్యోగుల సెలవుల దరఖాస్తుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన ఆన్‌లైన్‌ సెలవుల నిర్వహణ వ్యవస్థ పోస్టర్‌ను మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆవిష్కరించారు. ఈ నూతన విధానం ద్వారా ఉద్యోగులు తమ సెలవుల దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నేరుగా సంబంధిత...