Sunday, October 11, 2026
Homeతెలంగాణకరీంనగర్బతుకమ్మ ఘాట్‌ అభివృద్ధికి సర్పంచి చర్యలు

బతుకమ్మ ఘాట్‌ అభివృద్ధికి సర్పంచి చర్యలు

📰 Generate e-Paper Clip

  • బస్వాపూర్‌ చెరువులో ఘాట్‌ శుభ్రత, వీధి దీపాల ఏర్పాటుకు కృషి

హుస్నాబాద్‌ , అక్టోబర్‌ 10 (చైతన్యగళం):

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామంలోని బతుకమ్మ ఘాట్‌ అభివృద్ధిపై గ్రామ సర్పంచి బానోతు లింగం నాయక్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఘాట్‌ వద్దకు వెళ్లి చెరువులోకి దిగేందుకు మహిళలు, గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, పరిసరాల శుభ్రతతో పాటు వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.

మంత్రి సీతక్క ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు సర్పంచి కృషి చేస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు నిర్వహించుకునేలా ఘాట్‌ పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతో పాటు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సంబంధిత నిధులను వినియోగించి అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి తాటిపాముల ప్రవీణ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు సానాది సింగరయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!