Saturday, October 10, 2026
Homeతెలంగాణకరీంనగర్హుస్నాబాద్‌లో ఘనంగా కాన్షీరాం వర్ధంతి

హుస్నాబాద్‌లో ఘనంగా కాన్షీరాం వర్ధంతి

📰 Generate e-Paper Clip

  • బహుజనుల ఐక్యతకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం

హుస్నాబాద్‌, అక్టోబరు 9 (చైతన్యగళం):

బహుజన సమాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు మాన్యవర్‌ కాన్షీరాం 20వ వర్ధంతిని పురస్కరించుకుని హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో శుక్రవారం నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బీఎస్పీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బహుజనుల సామాజిక, రాజకీయ అభ్యున్నతి కోసం కాన్షీరాం చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి వారి హక్కులు, అభివృద్ధి కోసం కాన్షీరాం విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. బామ్‌సెఫ్‌, డీఎస్‌-4 సంస్థలను స్థాపించి, 1984లో బహుజన సమాజ్‌ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా దేశ రాజకీయాల్లో బహుజన ఉద్యమానికి కొత్త దిశానిర్దేశం చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పచ్చిమట్ల రవీందర్‌ గౌడ్‌, అధ్యక్షుడు వేల్పుల రాజు, జిల్లా నాయకులు జేరిపోతుల రవీందర్‌, మారేపల్లి సుధాకర్‌, మొగిలిపాక శ్రీనివాస్‌, హనుమంతు, కనకయ్య, బాలయ్య, శ్రీనివాస్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!