Sunday, October 11, 2026
Homeతెలంగాణకరీంనగర్కిసాన్ నగర్‌లో బీజేపీ భారీ బైక్ ర్యాలీ

కిసాన్ నగర్‌లో బీజేపీ భారీ బైక్ ర్యాలీ

📰 Generate e-Paper Clip

కరీంనగర్ , అక్టోబర్ 8 (చైతన్యగళం):

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో గురువారం కిసాన్ నగర్ గాంధీ విగ్రహం నుంచి చింతల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ కిసాన్ నగర్ ప్రాంతంతో బండి సంజయ్‌కు విడదీయరాని అనుబంధం ఉందని, బీజేపీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారాలు కిసాన్ నగర్ నుంచే ప్రారంభమవుతాయని అన్నారు. కిసాన్ నగర్ గడ్డ బండి సంజయ్ అడ్డా అని పేర్కొన్నారు. కిసాన్ నగర్ ప్రజలకు బండి సంజయ్‌పై ఉన్న అభిమానాన్ని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మార్చలేవని అన్నారు.

యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఎంపీగా, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్-1, అమృత్-2, స్మార్ట్ సిటీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా వందల కోట్ల రూపాయల నిధులను కరీంనగర్‌కు తీసుకువచ్చారని అన్నారు. కిసాన్ నగర్‌లో రూ.65 కోట్లతో జరిగిన అభివృద్ధి పనులు, రోడ్లు, వీధి దీపాలు, ఇతర మౌలిక వసతులు స్మార్ట్ సిటీ నిధులతోనే జరిగాయని పేర్కొన్నారు. బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గత మూడేళ్లుగా కరీంనగర్ ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలు, ఐటీ టవర్, మానేరు రివర్‌ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి తదితర అంశాలపై ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. స్మార్ట్ సిటీ ద్వారా జరిగిన అభివృద్ధి కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషితోనే సాధ్యమైందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కిసాన్ నగర్ బీజేపీ నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!