వయోవృద్ధుల హక్కులపై అవగాహన కల్పించాలి
సిద్దిపేట, అక్టోబర్ 1 (చైతన్యగళం): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సిద్దిపేట ఐడీఓసీలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచే పిల్లలకు వయోవృద్ధులను గౌరవించడం, వారితో ప్రేమాభిమానాలతో మెలగడం నేర్పించాలని సూచించారు. కుటుంబంలో వయోవృద్ధుల పాత్ర ఎంతో ముఖ్యమని, వారి అనుభవాలు, సూచనలు ఎంతో విలువైనవని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి శారద వయోవృద్ధుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, హక్కులు, చట్టపరమైన రక్షణల...