Thursday, October 1, 2026
Homeతెలంగాణకరీంనగర్కరీంనగర్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేత

కరీంనగర్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేత

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 30 (చైతన్యగళం):

కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కరీంనగర్ నగర అభివృద్ధికి సంబంధించిన 8 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ కార్పొరేషన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించాలని కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో సీఎం హామీల పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం వల్ల కొత్త పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొందని, వాటిని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిపత్రంలోని ప్రధాన అంశాల్లో గతంలో ఇచ్చిన హామీల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, కరీంనగర్ కార్పొరేషన్‌కు ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.100 కోట్లు మంజూరు చేయాలని కోరారు. రోజువారీ తాగునీటి సరఫరా కోసం ఎల్‌ఎండీలో ఎల్లప్పుడూ 15 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని, అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు అధిక సంఖ్యలో మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో పెండింగ్‌లో ఉన్న రవీంద్ర భారతి భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని, నగరపాలక సంస్థలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నాలుగు లైన్ల రింగ్ రోడ్డు నిర్మించాలని, అపోలో హాస్పిటల్ నుంచి వావిలాలపల్లి బ్రిడ్జి వరకు, అలాగే రేకుర్తి నుంచి కొత్తపల్లి వరకు ఫోర్‌లైన్ రోడ్లతో పాటు సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి, తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారని వైద్యుల అంజన్ కుమార్ తెలిపారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!