తరాల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయాలి – అంగన్వాడీ సూపర్వైజర్ చంద్రకళ

వర్ధన్నపేట , సెప్టెంబర్ 29 (చైతన్యగళం): అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వర్ధన్నపేట మండలం బండౌతపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం వద్ద మంగళవారం గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్వైజర్ చంద్రకళ ముఖ్యఅతిథిగా హాజరై వయోవృద్ధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వయోవృద్ధులు కుటుంబానికి విలువైన మార్గదర్శకులని, వారి అనుభవాలు భావితరాలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. పిల్లలు, యువత వయోవృద్ధులను గౌరవిస్తూ వారితో ఆత్మీయంగా మెలగాలని సూచించారు. పిల్లలు, వయోవృద్ధుల మధ్య అనుబంధాన్ని పెంపొందించేలా ఆటలు,...