Sunday, September 27, 2026
Homeతెలంగాణసిద్ధిపేట జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

సిద్ధిపేట జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

సిద్దిపేట, సెప్టెంబర్ 26 (చైతన్యగళం):

సిద్ధిపేట జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను రంగనాయక సాగర్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు హాజరయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, జిల్లా పర్యాటక నోడల్ అధికారి విజయ్ భార్గవ్, డిప్యూటీ కలెక్టర్ శిక్షణ భవ్య, సిద్ధిపేట రెవెన్యూ డివిజనల్ అధికారి సదానందం, సర్పంచ్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జిల్లా స్థాయి యువ టూరిజం క్లబ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మూడు కళాశాలల క్లబ్‌లకు, మూడు పాఠశాలల క్లబ్‌లకు ముఖ్య అతిథి, జిల్లా కలెక్టర్ మరియు ఇతర ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తమ ప్రతిభను ప్రదర్శించారు. పర్యాటక ప్రాముఖ్యత, చారిత్రక వారసత్వ పరిరక్షణ, స్థానిక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై అవగాహన కల్పించారు.

అనంతరం రంగనాయక సాగర్ వంతెనపై విద్యార్థులతో వారసత్వ నడక నిర్వహించారు. పర్యావరణ పర్యాటకంలో భాగంగా విద్యార్థులు మార్పడగలోని ఆక్సిజన్ పార్కును సందర్శించారు. అక్కడ అటవీ, పర్యాటక శాఖ అధికారుల సమక్షంలో పార్కు ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ, జీవవైవిధ్యం తదితర అంశాలపై అవగాహన పొందారు జిల్లా సంక్షేమ అధికారి డీడబ్ల్యూఓ శారద విద్యార్థులకు పోషకాహారం ప్రాముఖ్యత, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సమతుల్య ఆహారం గురించి వివరించారు తెలంగాణ దర్శిని పర్యాటక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కొమురవెల్లి శ్రీ మల్లన్న స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. విద్యార్థులందరికీ స్వామివారి దర్శనం కల్పించారు. ఆలయ చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యత, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివరించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈఓ సుధాకర్ రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి ఏఈఓ బుద్ధి శ్రీనివాస్ విద్యార్థులందరికీ స్వామివారి దర్శనం, భోజన వసతి, లడ్డూ ప్రసాదం పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేశారు అనంతరం స్థానిక కళాకారులు ఉగ్గతులు, పెద్దపట్నం తదితర సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించి ఆలయ విశిష్టత, చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల ద్వారా విద్యార్థుల్లో పర్యాటకంపై అవగాహన పెంపొందించడం, స్థానిక వారసత్వం, పర్యావరణం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై చైతన్యం కల్పించడం, సిద్ధిపేట జిల్లాలో పర్యాటక అభివృద్ధిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!