Tuesday, September 29, 2026
Homeతెలంగాణకరీంనగర్ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది: నాయకులు

కోహెడ, సెప్టెంబరు 27 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్‌ గ్రామంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొక్కుల రమేష్‌ ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బాపూజీ చిత్రపటానికి గ్రామ సర్పంచ్‌ బానోతు లింగం నాయక్‌, మాజీ ఎంపీటీసీ, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు కొక్కుల సురేష్‌, కొక్కుల రమేష్‌ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఉద్యమం కోసం మంత్రి పదవిని సైతం త్యజించిన త్యాగశీలి అని కొనియాడారు. ఆయనను తెలంగాణ ఉక్కు మనిషిగా అభివర్ణించారు.

బాపూజీ జయంతిని పురస్కరించుకుని గ్రామపంచాయతీ వద్ద రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ తాటిపాముల ప్రవీణ్‌, మాజీ సర్పంచులు ఎడబోయిన సత్తయ్య, చింతల బాలనర్సు, వార్డు సభ్యులు, పద్మశాలి సంఘం ప్రతినిధులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!