అందరూ చదువుకుని విజ్ఞానం వైపు అడుగులు వేయాలి: సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్
యాచారం, సెప్టెంబరు 27 (చైతన్యగళం): ప్రతి ఒక్కరూ చదువుకుని అజ్ఞానాన్ని వీడి విజ్ఞానం వైపు అడుగులు వేయాలని మేడిపల్లి నక్కర్త గ్రామ సర్పంచ్ ముచ్చర్ల సుగుణ సంపత్ అన్నారు. యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామంలో ఆదివారం ఉల్లాస్–నవభారత సాక్షరత కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వశక్తి సంఘాల మహిళల్లో 15 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకోవడం ద్వారా సమాజాన్ని అర్థం చేసుకుని, తమ హక్కులు, బాధ్యతలపై...