Saturday, September 26, 2026
Homeతెలంగాణకరీంనగర్మిత్ర యూత్ ఆధ్వర్యంలో భారీ వినాయకుడి నిమజ్జనం

మిత్ర యూత్ ఆధ్వర్యంలో భారీ వినాయకుడి నిమజ్జనం

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 25 (చైతన్య గళం):

నగరపాలక సంస్థ పరిధిలోని టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డులో మిత్ర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన భారీ వినాయక విగ్రహ నిమజ్జనోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మికంగా నిర్వహించారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని గణపయ్యకు చివరి పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. స్వామివారి ఆశీస్సులతో నగర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

మిత్ర యూత్ సభ్యులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని మేయర్ పేర్కొన్నారు. అనంతరం భక్తుల గణపతి బప్పా మోరియా నామస్మరణలు, డప్పు వాయిద్యాలు, కోలాటాల నడుమ భారీ వినాయకుడి శోభాయాత్ర వైభవంగా సాగింది. నిమజ్జన కార్యక్రమంలో యూత్ నిర్వాహకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!