Saturday, September 26, 2026
Homeతెలంగాణకరీంనగర్మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత 

మత్తు పదార్థాల నిర్మూలన సమిష్టి బాధ్యత 

📰 Generate e-Paper Clip

కరీంనగర్, సెప్టెంబర్ 25 (చైతన్య గళం):

మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, కరీంనగర్‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పాఠశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. పోలీస్, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.

అడిషనల్ డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు పోలీసు శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోందన్నారు. తరచుగా హాస్టళ్లు, బస్టాండ్‌ల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డ్రగ్స్ మూలాలను సమూలంగా అంతం చేస్తామని, డ్రగ్స్ వినియోగం, అమ్మకం తదితర సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని కోరారు.

అనంతరం తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాలకు సంబంధించిన పోస్టర్, బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, జిల్లా వైద్యాధికారి రాజగోపాల్, ఎక్సైజ్, పోలీస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!