హుస్నాబాద్ బస్టాండ్‌లో ఊడిపడిన సీలింగ్
హుస్నాబాద్, సెప్టెంబర్ 25 (చైతన్యగళం): హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రమాదం తప్పింది. బస్టాండ్‌లోని సిద్దిపేట, సికింద్రాబాద్ 7వ నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద గురువారం సాయంత్రం పైకప్పు ఒక్కసారిగా ఊడిపడి కిందపడింది. ఆ సమయంలో ప్రయాణికుల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పైకప్పు కిందపడిన సమయంలో ప్రయాణికులు ఎవరైనా అక్కడ ఉంటే బలమైన గాయాలు అయ్యే ప్రమాదం ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైకప్పు తడిసి ఊడిపోయి కిందపడినట్లు కనిపిస్తోంది. బస్టాండ్‌లో మరికొన్ని చోట్ల...