విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి

పలు వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు షాద్‌నగర్‌, సెప్టెంబరు 23 (చైతన్యగళం): కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వినాయక మండపాలను షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. గణనాథుడు ప్రజల జీవితాల్లోని విఘ్నాలను తొలగించి, సుఖసంతోషాలు, విజయాలు, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. కార్యక్రమాల్లో ఉమ్మడి మండలాల మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్‌,...