Thursday, September 17, 2026
Homeతెలంగాణనల్గొండబీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం

📰 Generate e-Paper Clip

  • అమరుల త్యాగాలను స్మరించుకోవాలి: పెదమాం భరత్‌

వేములపల్లి, సెప్టెంబరు 17 (చైతన్యగళం): మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు పెదమాం భరత్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా భరత్‌ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి, భుక్తి కోసం ఎందరో అమరులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ఆపరేషన్‌ పోలో ద్వారా సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన వీరుల చరిత్రను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్ర సాంబమూర్తి యాదవ్‌, రాష్ట్ర నాయకుడు జవ్వాజీ సత్యనారాయణ యాదవ్‌, మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి పందిరి భాగ్యమ్మ, జిల్లా కార్యవర్గ సభ్యుడు బొల్లెద్దు లవయ్య, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మల జాన్‌రెడ్డి, నాయకులు పగిడిపల్లి సోమయ్య, పుష్పలత, కేతనపల్లి భూపాల్‌రెడ్డి, నిమ్మనగోటి మహేష్‌, ఇరుగుదిండ్ల నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!