Thursday, September 17, 2026
Homeతెలంగాణరంగారెడ్డిఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

మంకాల్ డివిజన్, సెప్టెంబర్ 17(చైతన్యగళం): తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మంకాల్ డివిజన్ 67వ పరిధిలో కోటకాడి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.

తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాకీ విలాస్, శ్రీనివాస్ నాయక్, నల్లోళ్ల రమాకాంత్, పుణ్య నాయక్, బాకీ మంకయ్య, రవి నాయక్, రవీందర్, మహేష్, బుడిద అన్వేష్, బుడిద శంకర్, కర్నాటి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని, విముక్తి కోసం పోరాడిన వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి, దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!