అచ్చంపేట, సెప్టెంబరు 17 (చైతన్యగళం): అచ్చంపేట పట్టణంలో నూతనంగా నియమితులైన మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆశీస్సులతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కడం తన అదృష్టమని, తనపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి కపిలవాయి శేఖర్, అచ్చంపేట తాలూకా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతల రాజగోపాల్, మండల అధ్యక్షుడు బుచ్చి రాములు, కొండూరు శేఖర్, భరత్‌కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
