బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం
అమరుల త్యాగాలను స్మరించుకోవాలి: పెదమాం భరత్ వేములపల్లి, సెప్టెంబరు 17 (చైతన్యగళం): మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు పెదమాం భరత్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూమి, భుక్తి కోసం ఎందరో అమరులు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. మహారాష్ట్ర,...