- 43, 56వ డివిజన్లలో కరపత్రాల పంపిణీ.. ర్యాలీలు
- కార్పొరేటర్లు దొంతు శ్రీనివాస్, కొమ్ము స్వప్న వేణు
రామగుండం, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా రామగుండం మున్సిపల్ పరిధిలోని 43, 56వ డివిజన్లలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేసి, ర్యాలీలు నిర్వహించారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆదేశాల మేరకు 56వ డివిజన్‌లో కార్పొరేటర్ కొమ్ము స్వప్న వేణు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తోందన్నారు.

56వ డివిజన్‌లో కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌కు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి కళ్యాణి సింహాచలం, జోనల్ ఇన్‌చార్జి గట్ల రమేష్, డివిజన్ అధ్యక్షుడు ఎర్రరోజు శ్యామ్, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా 43వ డివిజన్‌లో కార్పొరేటర్ దొంతు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటి కరపత్రాల పంపిణీతో పాటు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి బొమ్మక రాజేష్, సింహాచలం, యుగంధర్, దినాకర్, వినోద్, ప్రశాంత్, వరలక్ష్మి, వసంత, అనిత, లక్ష్మి, డివిజన్ యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
