ప్రజాపాలనపై ఇంటింటా ప్రచారం
43, 56వ డివిజన్లలో కరపత్రాల పంపిణీ.. ర్యాలీలు కార్పొరేటర్లు దొంతు శ్రీనివాస్, కొమ్ము స్వప్న వేణు రామగుండం, సెప్టెంబర్ 13 (చైతన్యగళం): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనకు వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా రామగుండం మున్సిపల్ పరిధిలోని 43, 56వ డివిజన్లలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేసి, ర్యాలీలు నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఆదేశాల మేరకు 56వ డివిజన్‌లో కార్పొరేటర్ కొమ్ము స్వప్న వేణు...