Wednesday, October 7, 2026
Homeతెలంగాణకరీంనగర్కాచాపూర్‌కు గౌరవెల్లి కాలువ నీరు

కాచాపూర్‌కు గౌరవెల్లి కాలువ నీరు

📰 Generate e-Paper Clip

  • 1,100 ఎకరాలకు సాగునీరు.. రూ.44.70 లక్షలతో దేవుల చెరువు పునరుద్ధరణ: మంత్రి పొన్నం

కోహెడ, అక్టోబరు 6 (చైతన్యగళం): కాచాపూర్‌, సీసీపల్లి గ్రామాలకు చెందిన సుమారు 1,100 ఎకరాలకు సాగునీరు అందించేలా గౌరవెల్లి కాలువ నీటిని తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. కాచాపూర్‌లో నిర్వహించిన ‘పల్లెపల్లెకు పొన్నంఅన్న.. పల్లెపల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ నిధులతో రూ.44.70 లక్షలతో చేపట్టిన దేవుల చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు.

గ్రామస్థులతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్న మంత్రి.. నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు, నీటి కుంటలు నిర్మించుకోవాలని సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, ముఖ్యంగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించాలని కోరారు.

కాచాపూర్‌, సీసీపల్లి గ్రామాల్లో భూములు కోల్పోయిన సుమారు 118 మంది రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కోహెడ నుంచి మైసంపల్లి వరకు 10 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరయ్యాయని, సీసీపల్లి, మైసంపల్లి, కాచాపూర్‌ గ్రామాలను అనుసంధానించే రహదారి నిర్మాణానికి రూ.8.30 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామస్థులు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఆర్డీవో, డీఆర్‌డీఓ, డీపీఓ, సర్పంచ్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!