విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

కరీంనగర్‌, సెప్టెంబరు 1 (చైతన్య గళం): విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా సూచించారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను మంగళవారం సాయంత్రం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు కళాశాలలోని వసతులను పరిశీలించిన కలెక్టర్‌ విద్యార్థులతో ఆత్మీయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యత, మెనూ అమలు, చదువు పరిస్థితి, యూనిఫాంలు, పుస్తకాలు అందాయా లేదా అనే వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి...