కరీంనగర్‌లో మత్తు పదార్థాల కలకలం
కరీంనగర్,ఆగస్టు 28 (చైతన్యగళం): హాష్ ఆయిల్, గంజాయి, మత్తు మాత్రలు విక్రయిస్తున్న తొమ్మిది మంది యువకులను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.6.50 లక్షల విలువైన మత్తు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు కరీంనగర్ సీపీ గౌష్ అలాం, రూరల్ ఏసీపీ ఏ. విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ ఏ. నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ లక్ష్మారెడ్డి, సిబ్బంది బొమ్మకల్‌లోని నేచర్ క్యూర్ ఆస్పత్రి సమీపంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని...