ఇచ్చిన మాటకు కట్టుబడి – ఆడబిడ్డకు అండగా రవీందర్‌సింగ్

కరీంనగర్ , ఆగస్టు 26 (చైతన్యగళం): ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తున్న 58వ డివిజన్ కార్పొరేటర్, మాజీ మేయర్, రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్ధార్ రవీందర్‌సింగ్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నారు. 58వ డివిజన్‌కు చెందిన దుర్శెట్టి ప్రసూన–మహేంద్ర చారి దంపతుల కుమార్తె అనుశ్రీ–శ్రీనివాస చారి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వివాహానికి ముందే ఆడబిడ్డకు రూ.25 వేల ఆర్థిక సహాయంతో పాటు పట్టుచీరను...