కరీంనగర్, ఆగస్టు 25 (చైతన్య గళం): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137-ఏ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 1,200 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని పలువురు ప్రముఖుల పుట్టినరోజులను పురస్కరించుకుని చేపట్టారు. ఆగస్టు 24న ఇంజనీర్ కోల అన్నారెడ్డి పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటగా, ఆగస్టు 25న బి. తిరుపతి రాజు, 26న శాస్త్రి, 27న జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, 30న చెరిమాల వెంకటేశ్వర్లు పుట్టినరోజుల సందర్భంగా మొక్కలు నాటనున్నారు ఈ సందర్భంగా ఇంజనీర్ కోల అన్నారెడ్డిని ఘనంగా సన్మానించి మొక్కలు నాటారు. పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను ప్రధాన లక్ష్యంగా చేసుకుని అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, ఈద కుమారస్వామి, పులాల శ్యామ్, సాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, సీహెచ్ వెంకటేశ్వర్లు, సోమవారపు వెంకన్న, గాలిపల్లి నాగేశ్వర్ తదితరులు, పాఠశాల ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
