హుజురాబాద్‌లో బీజేపీని బలోపేతం చేయాలి

హుజురాబాద్, ఆగస్టు 24 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ శాఖ నూతన కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విశేష ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హాజరై పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా ముందుకు సాగుతోందని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత...