- ముగ్గురు హంతకులకు యావజ్జీవ కారాగార శిక్షలు.. గంజాయి, పోక్సో, దాడులు, చోరీ, మోసం కేసుల్లోనూ జైలు శిక్షలు
- కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సీపీ గౌష్ ఆలం అభినందనలు
కరీంనగర్, ఆగస్టు 20 (చైతన్యగళం): నేరస్థులకు చట్టపరంగా గుణపాఠం చెప్పడంలో కరీంనగర్ జిల్లా పోలీస్ కోర్టు విభాగం గణనీయమైన ఫలితాలు సాధించింది. పకడ్బందీ దర్యాప్తు, పటిష్ఠమైన సాక్ష్యాధారాల సమర్పణ, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమన్వయంతో ఈ ఏడాది ఇప్పటివరకు 17 కీలక కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించాయి. మూడు హత్య కేసుల్లో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షలు పడగా.. గంజాయి, పోక్సో, హత్యాయత్నం, దాడులు, చోరీ, చీటింగ్, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లోనూ జైలు శిక్షలు, జరిమానాలు విధించారు.
జిల్లా క్రైమ్ రివ్యూ సమావేశంలో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతంగా పనిచేసిన కోర్టు డ్యూటీ అధికారులు, సీడీవోలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అదనపు పీపీలు, ఏపీపీలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ముగ్గురు హంతకులకు జీవిత ఖైదు
కరీంనగర్ రూరల్ క్రైం నంబర్ 155/2019 హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.1,500 జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి ఎన్. రాజేందర్ (హెచ్‌సీ 2325), పీపీ ఎం. ప్రతాప్ కేసులో సమర్థంగా వ్యవహరించారు.

ఎల్‌ఎండీ కాలనీ క్రైం నంబర్ 09/2022 హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి ఎం. శంకర్ (హెచ్‌సీ 1607), అదనపు పీపీ ఎం. ప్రతాప్ కీలకంగా వ్యవహరించారు.
వీణవంక క్రైం నంబర్ 156/2020 హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.7,000 జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి రాచకొండ శ్రీనివాస్ (పీసీ 857), పీపీ ఎం. ప్రతాప్ కేసు విచారణలో సమర్థంగా పనిచేశారు.
ఇతర హత్య కేసుల్లోనూ కఠిన శిక్షలు
కరీంనగర్-3 టౌన్ క్రైం నంబర్ 333/2023 కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారులు ఎస్. సుధాకర్ (హెచ్‌సీ 835), జె. ఓదయ్య (పీసీ 3514), పీపీ ఎం. ప్రతాప్ వ్యవహరించారు.
గంగాధర క్రైం నంబర్ 17/2020 కేసులో నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి జె. సాయిలుగౌడ్ (పీసీ 2208), అదనపు పీపీ డి. శరత్ కేసులో భాగస్వాములయ్యారు.
చొప్పదండి క్రైం నంబర్ 41/2021 కేసులో నిందితుడికి ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.6,500 జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి బి. శ్రీధర్ (పీసీ 2302), పీపీ ఎం. ప్రతాప్ సమన్వయంతో కేసు ముందుకు సాగింది.
కరీంనగర్ రూరల్ క్రైం నంబర్ 57/2020 కేసులో నిందితుడికి ఐదేళ్ల సాధారణ జైలు శిక్ష విధించారు. కోర్టు డ్యూటీ అధికారి ఎన్. రాజేందర్ (హెచ్‌సీ 2325), అదనపు పీపీ డి. శరత్ వ్యవహరించారు.
గంజాయి కేసుల్లో ఉక్కుపాదం
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసు, న్యాయ విభాగాలు సమన్వయంతో కఠిన చర్యలు కొనసాగిస్తున్నాయి. కరీంనగర్-1 టౌన్ క్రైం నంబర్ 102/2023 గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి ఎస్.డి. సర్వర్ అలీ (పీసీ 3187), అదనపు పీపీ డి. శరత్ కేసులో సమర్థంగా వ్యవహరించారు.
గంగాధర క్రైం నంబర్ 97/2022 కేసులో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి బి. శ్రీధర్ (పీసీ 2302), అదనపు పీపీ డి. శరత్ కేసును నడిపించారు.
ఎల్‌ఎండీ కాలనీ క్రైం నంబర్ 279/2022 కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి టి. శ్రీనివాస్ (పీసీ 367), అదనపు పీపీ డి. శరత్ సమన్వయంతో కేసు ముందుకు సాగింది.
పోక్సో, దాడులు, చోరీ కేసుల్లోనూ శిక్షలు
చిగురుమామిడి క్రైం నంబర్ 152/2021 పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి జి. అరవింద్ (పీసీ 3858), పీపీ డి. శరత్ కేసులో వ్యవహరించారు.
చొప్పదండి క్రైం నంబర్ 25/2022 తీవ్ర గాయాల కేసులో నిందితుడికి 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి బి. నవీన్‌కుమార్ (పీసీ 3906), ఏపీపీ ఎ. రంజిత్‌కుమార్ కేసులో పనిచేశారు.

కొత్తపల్లి క్రైం నంబర్ 102/2024 చోరీ కేసులో నిందితుడికి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.200 జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి కె. మౌనిక (డబ్ల్యూపీసీ 3785), ఏపీపీ జి. వీరస్వామి కేసును నడిపించారు.
కరీంనగర్-1 టౌన్ క్రైం నంబర్ 124/2015 చీటింగ్ కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి చొల్ల కంకయ్య (పీసీ 865), ఏపీపీ ఎ. రంజిత్‌కుమార్ వ్యవహరించారు.
రోడ్డు ప్రమాదాల కేసుల్లోనూ శిక్షలు
మానకొండూర్ క్రైం నంబర్ 44/2023 కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి పి. మౌనిక (డబ్ల్యూపీసీ 3754), అదనపు పీపీ గాయత్రి కేసులో వ్యవహరించారు.
చిగురుమామిడి క్రైం నంబర్ 100/2017 కేసులో నిందితుడికి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. కోర్టు డ్యూటీ అధికారి టి. గణేష్ (పీసీ 3895), అదనపు పీపీ జి. వీరస్వామి కేసును నడిపించారు.
ఎల్‌ఎండీ క్రైం నంబర్ 338/2016 కేసులో నిందితుడికి 18 నెలల జైలు శిక్ష విధించారు. కోర్టు డ్యూటీ అధికారి బి. మల్లికార్జున్, ఏపీపీ జి. వీరస్వామి కేసులో వ్యవహరించారు.
నేరం చేస్తే తప్పించుకోలేరు
ఈ ఏడాది ఇప్పటివరకు 17 కీలక కేసుల్లో న్యాయస్థానాలు నిందితులకు శిక్షలు విధించాయి. ఇందులో మూడు హత్య కేసులకు యావజ్జీవ కారాగార శిక్షలు, కల్పబుల్ హోమిసైడ్ కేసుల్లో గరిష్ఠంగా పదేళ్ల కఠిన కారాగార శిక్షలు, గంజాయి/ఎన్‌డీపీఎస్ కేసుల్లో ఐదేళ్ల వరకు కఠిన జైలు శిక్షలతో పాటు జరిమానాలు విధించబడ్డాయి. పోక్సో, దాడులు, చోరీ, చీటింగ్, రోడ్డు ప్రమాదాల కేసుల్లోనూ నిందితులకు శిక్షలు ఖరారయ్యాయి.
బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడంతో పాటు నేరస్థులకు శిక్షలు పడేలా కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు. జిల్లాలో నేరాలకు పాల్పడితే చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
పకడ్బందీ దర్యాప్తే విజయానికి పునాది
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ.. జిల్లాలో నేర రహిత సమాజ స్థాపనతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందించడం పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. నేరస్థులకు న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చేయడం ద్వారా నేరాల నియంత్రణకు మరింత దోహదపడుతుందన్నారు.
విచారణ అధికారుల పకడ్బందీ దర్యాప్తు, కోర్టు డ్యూటీ సిబ్బంది నిరంతర పర్యవేక్షణ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల చొరవతోనే 17 కీలక కేసుల్లో శిక్షలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఇదే నిబద్ధతతో భవిష్యత్తులోనూ పనిచేస్తూ నేరస్థులకు చట్టపరంగా గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారెవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
బాధితుల పక్షాన నిలిచి నిందితులకు శిక్షలు ఖరారయ్యేలా కృషి చేసిన ప్రతి అధికారి, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను సీపీ ప్రత్యేకంగా అభినందించారు.
