నేరగాళ్లకు చట్టం గుణపాఠం.. 17 కీలక కేసుల్లో కఠిన శిక్షలు
ముగ్గురు హంతకులకు యావజ్జీవ కారాగార శిక్షలు.. గంజాయి, పోక్సో, దాడులు, చోరీ, మోసం కేసుల్లోనూ జైలు శిక్షలు కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సీపీ గౌష్ ఆలం అభినందనలు కరీంనగర్, ఆగస్టు 20 (చైతన్యగళం): నేరస్థులకు చట్టపరంగా గుణపాఠం చెప్పడంలో కరీంనగర్ జిల్లా పోలీస్ కోర్టు విభాగం గణనీయమైన ఫలితాలు సాధించింది. పకడ్బందీ దర్యాప్తు, పటిష్ఠమైన సాక్ష్యాధారాల సమర్పణ, కోర్టు డ్యూటీ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమన్వయంతో ఈ ఏడాది ఇప్పటివరకు 17 కీలక కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధించాయి....