కరీంనగర్ లో తాంత్రిక పూజల కలకలం

క్షుద్ర పూజలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు? రాత్రివేళ అనుమానాస్పద కార్యకలాపాలపై 112కు సమాచారం.. స్పందన లేదంటున్న స్థానికులు కరీంనగర్ టౌన్, ఆగస్టు 11 (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని మారుతినగర్ 36వ డివిజన్ పరిధిలో రాత్రివేళ అనుమానాస్పదంగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భయాందోళనకు గురైన కొందరు స్థానికులు అత్యవసర సహాయక నంబర్ 112కు ఫోన్ చేసి మూడో పట్టణ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. రాత్రి సమయంలో వరుసగా ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను...