Sunday, October 4, 2026
Homeక్రైమ్ న్యూస్తల్లి హత్య, తమ్ముడిపై హత్యాయత్నం కేసులో జీవిత ఖైదు

తల్లి హత్య, తమ్ముడిపై హత్యాయత్నం కేసులో జీవిత ఖైదు

📰 Generate e-Paper Clip

  • ఆస్తి వివాదంలో రోకలిబండతో దాడి.. నిందితుడికి రూ.10 వేల జరిమానా

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 11 (చైతన్యగళం): ఆస్తి వివాదం నేపథ్యంలో తల్లి, తమ్ముడిపై రోకలిబండతో దాడి చేసి తల్లిని హత్య చేసి, తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు అగుర్ల లింగయ్యకు జీవిత ఖైదు విధిస్తూ గౌరవ ఫ్యామిలీ కోర్టు, IV అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిందితుడికి రూ.10 వేల జరిమానా కూడా విధించింది.

కేసు వివరాల ప్రకారం.. 2022 అక్టోబర్‌ 24న ఉదయం 9.40 గంటల సమయంలో కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇరుకుల్ల గ్రామంలో ఘటన చోటుచేసుకుంది. తనకు రావాల్సిన భూమి వాటాను తన పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయాలని తల్లి, తమ్ముడిని కోరుతూ లింగయ్య గొడవకు దిగాడు. ఆస్తి వివాదంతో ఆగ్రహానికి గురైన అతడు వారిని హత్య చేయాలనే ఉద్దేశంతో రోకలిబండతో తలపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘటనపై కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు క్రైం నంబర్‌ 318/2022లో ఐపీసీ 302, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని నేర అంగీకారంతో హత్యకు ఉపయోగించిన రక్తపు మరకలున్న రోకలిబండను స్వాధీనం చేసుకున్నారు. వైద్య, ఫోరెన్సిక్‌ శాస్త్ర ప్రయోగశాల ఆధారాలతోపాటు పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేసి న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించడంతో నేరం రుజువైంది.

2026లో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇది 21వ నేర నిర్ధారణ కావడం విశేషం. ఏసీపీ సీసీఆర్బీ శ్రీనివాస్‌ జి. పర్యవేక్షణలో అప్పటి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌, దర్యాప్తు అధికారి పి. విజ్ఞాన్‌రావు, ప్రస్తుత ఇన్‌స్పెక్టర్‌ ఎ. నిరంజన్‌రెడ్డి, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు జె. శ్రీరాములు, ఎం. ప్రతాప్‌, కోర్టు విధుల అధికారులు ఎన్‌. రాజేందర్‌, కె. మధుసూదన్‌, కోర్టు పర్యవేక్షణ సిబ్బంది ఆర్‌. శ్రీనివాస్‌ తదితరులు కీలకంగా కృషి చేశారు. వారిని పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!