మర్రిగూడలో ఏటీఎం కోసం ప్రజల వినతి – మేనేజర్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహం
మర్రిగూడ, ఆగస్టు 4 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ దురుసు ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమావత్ శీను నాయక్ మండల ప్రజల తరఫున గళమెత్తారు. మర్రిగూడ మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉండగా, రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, యువకులు రోజువారీ లావాదేవీల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జున గ్రామీణ బ్యాంకు మరియు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు ఉన్నప్పటికీ, ఏటీఎంలు లేక ప్రజలు...