Monday, August 3, 2026
Homeతెలంగాణఏటీఏ మహాసభల్లో శాతవాహన వీసీ ఉమేష్ కుమార్

ఏటీఏ మహాసభల్లో శాతవాహన వీసీ ఉమేష్ కుమార్

📰 Generate e-Paper Clip

కరీంనగర్(చైతన్యగళం): అమెరికాలోని మేరీల్యాండ్ వేదికగా నిర్వహించిన అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) 19వ మహాసభలు–యూత్ కన్వెన్షన్‌లో శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సులో విద్యా, సాంస్కృతిక, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆచార్య ఉమేష్ కుమార్ శాతవాహన విశ్వవిద్యాలయం విద్యా ప్రగతి, పరిశోధన అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యంపై వివరించారు. ఈ పర్యటన ద్వారా ప్రవాస భారతీయులు, విదేశీ విద్యాసంస్థలతో విద్యా, పరిశోధన రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని విశ్వవిద్యాలయం ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వేదికపై శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించడం విశ్వవిద్యాలయంతో పాటు కరీంనగర్ జిల్లాకు గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!