ఏటీఏ మహాసభల్లో శాతవాహన వీసీ ఉమేష్ కుమార్

కరీంనగర్(చైతన్యగళం): అమెరికాలోని మేరీల్యాండ్ వేదికగా నిర్వహించిన అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) 19వ మహాసభలు–యూత్ కన్వెన్షన్‌లో శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సులో విద్యా, సాంస్కృతిక, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్య ఉమేష్ కుమార్ శాతవాహన విశ్వవిద్యాలయం విద్యా ప్రగతి, పరిశోధన అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యంపై వివరించారు. ఈ పర్యటన ద్వారా ప్రవాస భారతీయులు, విదేశీ విద్యాసంస్థలతో...