ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం): ఆషాడమాసం సందర్భంగా కరీంనగర్ భగత్‌నగర్‌లోని గోదాంగడ్డలో పోచమ్మ తల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీల్ రావు భక్తిశ్రద్ధలతో నెత్తిన బోనం ఎత్తి అందరి దృష్టిని ఆకర్షించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలతో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపులో పాల్గొని...