Monday, August 17, 2026
Homeఆంధ్రప్రదేశ్ప్రతిష్టాత్మకంగా ఆరవ విడత మొబైల్ రికవరీ మేళా

ప్రతిష్టాత్మకంగా ఆరవ విడత మొబైల్ రికవరీ మేళా

📰 Generate e-Paper Clip

నంద్యాల, జూలై 25 (చైతన్యగళం): ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్త, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఐపీఎస్ పర్యవేక్షణలో, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతిష్టాత్మకంగా ఆరవ విడత మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు.ఈ సందర్భంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుండి రికవరీ చేసిన 594 మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు ₹1,06,92,590గా ఉంది.జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, “మొబైల్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక భాగమైంది. కుటుంబ, వ్యాపార, ఉద్యోగ, బ్యాంకింగ్ వంటి వ్యక్తిగత సమాచారం మొత్తం మొబైల్‌లోనే ఉంటుంది.

కాబట్టి ప్రతి ఒక్కరూ మొబైల్‌ను జాగ్రత్తగా ఉంచుకోవాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ సుస్మిత ఐపీఎస్,అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎస్. ఖాదర్ భాషా, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!