ప్రతిష్టాత్మకంగా ఆరవ విడత మొబైల్ రికవరీ మేళా

నంద్యాల, జూలై 25 (చైతన్యగళం): ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్త, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఐపీఎస్ పర్యవేక్షణలో, నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతిష్టాత్మకంగా ఆరవ విడత మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు.ఈ సందర్భంగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గోవా, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుండి రికవరీ చేసిన 594 మొబైల్ ఫోన్లు బాధితులకు...