Tuesday, July 21, 2026
Homeతెలంగాణపెద్దపల్లి జిల్లా ఆటో జేఏసీ నూతన కమిటీ ఏకగ్రీవం

పెద్దపల్లి జిల్లా ఆటో జేఏసీ నూతన కమిటీ ఏకగ్రీవం

📰 Generate e-Paper Clip

  • సంఘం బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ

పెద్దపల్లి, జూలై 20 (చైతన్యగళం):
పెద్దపల్లి జిల్లా ఆటో జేఏసీ నూతన అడహాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలో జరిగిన అత్యవసర సమావేశంలో రాష్ట్ర స్థాయి నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని, ఆటో కార్మికుల సమస్యలు, సంఘం బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

సమావేశం అనంతరం జిల్లా జేఏసీని మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో నూతన కమిటీని ప్రకటించారు.

* జిల్లా కన్వీనర్ – ఎనగందుల నాంపల్లి
* జిల్లా కో-కన్వీనర్ – ఎస్కే జబ్బర్
* రామగుండం నియోజకవర్గ కన్వీనర్ – ఎండి గౌస్
* రామగుండం నియోజకవర్గ కో-కన్వీనర్ – మడిపెద్ద రమేష్
* మంథని నియోజకవర్గ కన్వీనర్ – మట్ట నరసయ్య
* పెద్దపల్లి నియోజకవర్గ కన్వీనర్ – యాదగిరి శంకర్

రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, “ఆటో కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేయాలి. జిల్లా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి” అని సూచించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్మడిశెట్టి రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జనగామ కుమార్, ఐబి చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుగూడాల సాయిలు, కరీంనగర్ జిల్లా ఇంచార్జి మద్దేల రాజేందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కట్ట రామ్‌కుమార్, నాయకులు నాగేశ్వరరావు, కాసిపేట రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!