దళితులకు రక్షణ కల్పించండి

ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఆల్ సంఘాల ఐక్యవేదిక విన్నపం పెద్దపల్లి,జూన్ 18(చైతన్య గళం): పెద్దపల్లి జిల్లాలో దళితులపై పెరుగుతున్న దాడులు,భూకబ్జాలు,సామాజిక వివక్ష, అధికారుల నిర్లక్ష్యంపై ఆల్ సంఘాల ఐక్యవేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాటకుల మహేష్ నాయకత్వంలో బాధితులు మరియు సంఘాల ముఖ్య నాయకులు శనివారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలిసి,సమగ్ర వినతి పత్రంతో పాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న అన్యాయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.జిల్లాలో చోటుచేసుకుంటున్న ఆలయ ప్రవేశ నిషేధాలు,కుల బహిష్కరణలు,భూ సమస్యలు,...