రాజన్న సిరిసిల్ల, జూలై 19 (చైతన్యగళం): ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్లలో ఆదివారం ఉదయం 8 గంటలకు బ్రహ్మశ్రీ పత్రీజీ ధ్యానం, మెడిటేషన్ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు జరిగింది.
పత్రీజీ నటించిన ధ్యానం–మెడిటేషన్ సినిమాను ప్రదర్శించి, “ధ్యానం చేసినచో ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది” అని నిరూపించారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ధ్యానం అలవర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి నటరాజ్ టాకీస్ మేనేజర్ కే. వెంకయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్స్ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు. సినిమా అనంతరం సీనియర్ సిటిజన్స్ సభ్యులు వెంకయ్యను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు చేపూరి బుచ్చయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనపాల శంకరయ్య, రాష్ట్ర ఈసీ మెంబర్ అంకారపు జ్ఞానోబా, జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగుల ఎల్లయ్య, జిల్లా కార్యదర్శులు గౌరిశెట్టి ఆనందం, వికృతి ముత్తయ్య గౌడ్, జిల్లా కోశాధికారి దొంత దేవదాసు తదితరులు పాల్గొన్నారు.
దొంత దేవదాసు, జనపాల శంకరయ్య మాట్లాడుతూ, “ఇటువంటి ఆధ్యాత్మిక సినిమాలు చూపించడం ఎంతో సంతోషకరం” అని అభిప్రాయపడ్డారు. నటరాజ్ టాకీస్ యాజమాన్యం, మేనేజర్ వెంకయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
