బ్రహ్మశ్రీ పత్రీజీ ధ్యానం – అవగాహన సదస్సు
రాజన్న సిరిసిల్ల, జూలై 19 (చైతన్యగళం): ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజన్న సిరిసిల్లలో ఆదివారం ఉదయం 8 గంటలకు బ్రహ్మశ్రీ పత్రీజీ ధ్యానం, మెడిటేషన్ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు జరిగింది. పత్రీజీ నటించిన ధ్యానం–మెడిటేషన్ సినిమాను ప్రదర్శించి, “ధ్యానం చేసినచో ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది” అని నిరూపించారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ధ్యానం అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి నటరాజ్ టాకీస్ మేనేజర్ కే. వెంకయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ సిటిజన్స్ కార్యవర్గ సభ్యులను ఆహ్వానించారు. సినిమా అనంతరం...