మర్రిగూడ, జూలై 15 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలోని గ్రామంలో నిశ్చరాల గుండ్ల వద్ద నూతనంగా నిర్మిస్తున్న శివాలయ పనులను బుధవారం ఎన్నారై మర్రిగూడ వాసి గుమ్మకొండ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు గుమ్మకొండ రఘునందన్ రెడ్డి సహకారంతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, “పుట్టిన ఊరికి ఏదో చేయాలనే తపనతో ఈ శివాలయాన్ని నిర్మిస్తున్నాను. ఆలయానికి దాదాపు కోటిన్నర రూపాయల వ్యయం అవుతుంది” అని తెలిపారు.
గ్రామ ప్రజలు ఈ శివాలయ నిర్మాణాన్ని హర్షం వ్యక్తం చేస్తూ, తమ ఊరికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్న మధుసూదన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, కర్నాటి సంతు మనోహర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
