Friday, August 28, 2026
Homeసంపాదకీయంవానలు పడాలే

వానలు పడాలే

📰 Generate e-Paper Clip

దండిగా వానలు పడాలే
ధరణి మురవాలే
వానలు పడాలే
వాగు వంకలు నిండాలే!!

పచ్చని పైరు పంటలు పండాలే
చెరువులు నిండాలే
చేపలు దండిగా ఉండాలే
బావులు నిండాలే
బాగా పంటలు పండాలే!!

కర్షకుని కష్టాలు తీరాలే
కర్షకుడు కడుపు నిండా తినాలే
ధరణిలో దండిగా పంటలు పండాలే
అవనిలో అందరూ మురవాలే!!

పల్లెలు పచ్చగా ఉండాలే
పశువుల గాసం దొరకాలే
బాగా వానలు పడాలే
బంగారు పంటలు పండాలి
వానతో వ్యవసాయం ముందుకు సాగాలి
ధరణిలో జనమంతా సంతోషంగా
ఉండాలే !!

దేవులపల్లి రమేశ్ (కవి, రచయిత )
కలం : వామిక శ్రీ వర్ష
నంగునూర్, సిద్దిపేట జిల్లా
9963701294.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!